Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 16 May 2022 14:29:33 IST

Rashmika mandanna ఇలా ఉండేది.. ఎలాంటి మార్పు రాలేదు!

twitter-iconwatsapp-iconfb-icon

నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక (Rashmika mandanna) మందన్నా తన వ్యక్తిగత విషయాల గురించి అరుదుగా మాట్లాడుతుంటారు. సోషల్‌ మీడియా మాధ్యమాల్లో వృత్తిపరమైన విషయాల గురించే ఆమె ప్రస్తావిస్తుంటారు. ‘నటిగా పరిచయం కాకముందు నా లైఫ్‌ ఇలా ఉండేది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె చిన్ననాటి స్నేహితురాలి పెళ్లి వేడుకలో సరదాగా గడిపారు. అక్కడి విషయాలతోపాటు పలు వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చారు. స్నేహితురాలి పెళ్లిలో తన లేడీ గ్యాంగ్‌తో కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 


‘‘రాగిణి(Rashmika friend raagini) నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తన పెళ్లి సందర్భంగా పాత స్నేహితులు అందరినీ కలిశాను. ఈ రోజు తర్వాత ఆమెతో నేను ఫొటోలు దిగలేను. అందుకే మిస్‌ అవ్వాలనుకోలేదు. తెల్లవారుజామున 4గంటలకే పెళ్లికి బయలుదేరా. ఫ్లైట్‌ మిస్‌ కావడం, మరో ఫ్లైట్‌ కూడా 4, 5 సార్లు డిలే కావడంతో ఆ పెళ్లికి హాజరు కాలేనేమో అనుకున్నా. దేవుడి దయవల్ల నేను కూడా పెళ్లిలో భాగమయ్యా. చిన్నప్పటి నుంచి ఈ గ్యాంగ్‌తోనే పెరిగా. 17 ఏళ్ల అనుబంధం మాది. కాలం మారుతున్నా వీళ్లల్లో ఏమాత్రం మార్పు రాలేదు. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. వీళ్లంతా నా వాళ్లు అని మరోసారి నిరూపించారు. చాలాకాలం తర్వాత ఇలా వీరిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో చెప్పాలనుకుంటున్నా. రష్మిక అనే అమ్మాయి నటిగా ప్రపంచానికి పరిచయం కాకముందు ఇలా ఉండేది. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు’’ అని రష్మిక మందన్నా (Rashmika)ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement