Sep 25 2021 @ 08:27AM

రష్మిక మందన్న: మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె తెలుగులో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప' షూటింగ్ చివరి దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్‌తో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా చేస్తోంది.

ఇక బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై' అనే సినిమా అలాగే యంగ్ సిద్దార్థ్ మల్‌హోత్రాకి జంటగా 'మిషన్ మజ్ఞు' చేస్తోంది. ఇప్పటికే 'మిషన్ మజ్ఞు' చిత్రాన్ని పూర్తి చేసిన రష్మిక హను రాఘవపూడి దర్శకత్వంలో మలాయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించేందుకు ఒకే చెప్పిందట. ఇప్పటికే ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను మెయిన్ హీరోయిన్‌గా ఎంచుకున్నారు. మరి రష్మిక నటించేది గనక నిజమైతే అది సెకండ్ లీడ్‌గానా లేక స్పెషల్ రోల్‌లో కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది.