Apr 17 2021 @ 13:25PM

జర్నలిస్టుగా రష్మిక మందన్న..!

క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా భారీ పాన్ ఇండియన్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని శిరీష్‌తో కలిసి నిర్మించబోతున్నాడు. టాలీవుడ్‌లో శంకర్ దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా.. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరో కావడంతో దేశ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే నిర్మాత దిల్ రాజు బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని డిసైడయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి రక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ ఒక అద్భుతమైన పాత్ర చేయబోతున్నాడన్న వార్త వచ్చి హాట్ టాపిక్‌గా మారింది. ఇక సంగీత దర్శకుడు థమన్ ఫిక్సైయ్యాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. 

అయితే ఇప్పుడు హీరోయిన్ విషయంలో వార్తలు మొదలయ్యాయి. ఇంతక ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ని ఎంపిక చేయాలనుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆక్రేజ్ ఇప్పుడు రష్మిక మందన్న కూడా సంపాదించుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కి హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు పరిశీలిస్తున్నారట. ఇక రష్మిక పాత్ర ఇదే అంటూ రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. శంకర్ ..రష్మిక మందన్నని జర్నలిస్టు పాత్రలో చూపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. శంకర్ సినిమాలలో హీరోయిన్స్‌కి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిన విషయమే. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి రష్మికకి ఈ అవకాశం దక్కితే అందనంత ఎత్తుకు చేరుకోవడం ఖాయంటున్నారు. చూడాలి మరి నిజంగా ఈ ప్రాజెక్ట్‌కి రష్మిక ని ఫైనల్ చేస్తారా లేదా..!