ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` సినిమాలతో సూపర్హిట్లు అందుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా మంచి జోరుమీదుంది. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ `పుష్ప`లో నటిస్తోంది. తాజాగా రష్మికకు మరో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. యంగ్ హీరో శర్వానంద్ సరసన రష్మిక తొలిసారి మెరవబోతోందట.
దర్శకుడు కిశోర్ తిరుమల రూపొందించనున్న `ఆడాళ్లూ మీకు జోహార్లు` సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్గా ఎంపిక చేశారట. ఈ సినిమా షూటింగ్ దసరా సందర్భంగా ఆదివారం తిరుపతిలో ప్రారంభం కాబోతోంది.