Abn logo
Jun 3 2020 @ 12:35PM

నేను ఎలాంటి పాత్రల్లో కనిపించాలి: రష్మిక

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రష్మిక.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచుగా ఛిట్‌ఛాట్ చేస్తోంది. తనకు సరిపోయే ఓ కొత్త పేరును సూచించాలని ఇటీవల రష్మిక ట్విటర్ ద్వారా కోరింది. 


తాజాగా మరోసారి అభిమానులకు రష్మిక పరీక్ష పెట్టింది. `భవిష్యత్తులో నన్ను ఎలాంటి సినిమాల్లో, పాత్రల్లో చూడాలనుకుంటున్నారు. చాలా ఆతృతగా ఉన్నా. త్వరగా సమాధానాలు చెప్పండి` అని రష్మిక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. `డియర్ కామ్రేడ్`లోని లిల్లీ, `గీతగోవిందం`లోని `గీత` వంటి పాత్రలు మరొకసారి చేయాలని కొందరు కోరారు. అలాగే `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాలోని సమంత పాత్ర చాలా చిలిపిగా ఉంటుందని, అలాంటి పాత్ర చేయమని మరొకరు సూచించారు. `రాజీ` సినిమాలోని ఆలియా భట్ పాత్రలాంటిది చేయాలని మరొకరు సమాధానమిచ్చారు. హారర్ సినిమాలు చేయమని కొందరు కోరారు.  



Advertisement
Advertisement
Advertisement