Abn logo
Oct 1 2020 @ 21:04PM

దద్దరిల్లకపోతే నన్ను అడగండి: రష్మీ

Kaakateeya

యంగ్ హీరో నందు విజయ కృష్ణ, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్‌'. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో హీరో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్‌కి అభిమానిగా న‌టిస్తున్నారని చిత్రయూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల విడుదల చేసిన నందు, రష్మిల ఫస్ట్ లుక్‌లకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నందు.. పోతురాజుగా, రష్మీ.. పోతురాజుగాడి పిల్ల వాణిగా నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. ఈ సినిమాలోని వారి లుక్స్‌ను విడుదల చేశారు. ఇక ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 2 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు.

ఈ టీజర్‌ విడుదల సందర్భంగా రష్మీ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 'టీజర్‌ దద్దరిల్లకపోతే నన్ను అడగండి. మార్కెట్‌లో మతి పోవాలి' అంటూ రష్మీ చిత్ర పోస్టర్‌ను ట్వీట్‌ చేసింది. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శ‌కునిగా చిత్రసీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. షూటింగ్‌తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement