Afghanistan: కుటుంబం గురించి స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఆందోళన

ABN , First Publish Date - 2021-08-16T16:56:59+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులతో స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆందోళన చెందుతున్నాడని...

Afghanistan: కుటుంబం గురించి స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఆందోళన

లండన్ (యూకే): అఫ్ఘానిస్థాన్‌ దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులతో స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆందోళన చెందుతున్నాడని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వెల్లడించారు. అప్ఘనిస్థాన్ దేశంలో కొనసాగుతున్న గందరగోళం కారణంగా కాబూల్ కర్జాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో రషీద్ ఖాన్ అతని కుటుంబాన్ని ఆఫ్ఘాన్ నుంచి బయటకు రప్పించలేక పోయారని పీటర్సన్ చెప్పారు. రషీద్ ఖాన్ ప్రస్థుతం యూకేలో ట్రెంట్ రాకాట్స్ కోసం ఆడుతున్నాడు.తాలిబాన్ ఉగ్రవాదులు అఫ్ఘాన్ రాజధాని కాబూల్ ను తమ నియంత్రణలోకి తీసుకోవడంతో దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తజికిస్థాన్ దేశానికి పారిపోయారు. 


Updated Date - 2021-08-16T16:56:59+05:30 IST