లెవల్ అప్ 11 ప్రచారకర్తగా రషీద్ ఖాన్

ABN , First Publish Date - 2022-04-14T02:29:32+05:30 IST

ముంబై : ఆన్‌లైన్ స్పోర్ట్స్ గేమింగ్ కంపెనీ లెవల్ అప్ 11 ఇండస్ట్రీలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ బ్రాండ్ ప్రచారకర్తగా స్పిన్నర్, స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ను నియమించుకుంది.

లెవల్ అప్ 11 ప్రచారకర్తగా రషీద్ ఖాన్

ముంబై : ఆన్‌లైన్ స్పోర్ట్స్ గేమింగ్ కంపెనీ లెవల్ అప్ 11 తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ప్రచారకర్తగా ఫేమస్ స్పిన్నర్, స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ను నియమించుకుంది. ఇక నుంచి లెవెల్ అప్ 11 సంస్థకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ఆన్‌లైన్‌లో పలు రకాల ఆటలను ప్రోత్సహించేందుకు అవసరమైన ప్ర‌చారాన్ని ఆయ‌న నిర్వ‌హించ‌నున్నారు. లెవెల్ అప్ 11 నూతన బ్రాండ్ అంబాసిడర్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘లెవల్ అప్ 11తో క‌లిసి ప‌నిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. జట్టును సృష్టించడం, గేమ్‌ను ప్రత్యక్షంగా అనుభవించే సామర్థ్యాన్ని ఇది అందిస్తుంది. లెవెల్ అప్ 11 ప్లాట్‌ఫామ్ సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంతోపాటు  ఆట పరిస్థితుల ఆధారంగా జట్టును సమీకరించే ప్రాముఖ్యతను వివరిస్తుంది’’ అని తెలిపారు. 


ఈ సందర్భంగా లెవెల్ అప్ 11 వ్యవస్థాపకులు, సీఈవో పరుల్ ఖన్నా మాట్లాడుతూ.. ‘‘క్రీడా అభిమానులలో రషీద్‌కి ఉన్న అపారమైన ఆదరణ, అతని నాయకత్వ సామర్థ్యాలు, పదునైన క్రికెట్ అంతర్ దృష్టి అతనిని మా బ్రాండ్‌కు అనువైన వ్యక్తిగా చేసింది. మా వినియోగదారులు వారి ఫాంటసీ టీమ్‌ను నిర్వహించేటప్పుడు కోరుకునే అన్ని లక్షణాలను ఇక్క‌డ ఎంపిక చేసుకొనేలా తీర్చిదిద్దాము. ఈ అనుబంధం మా ప్రస్తుత వినియోగదారుల‌తో సంబంధాల‌ను మ‌రింత పెంచ‌డానికి సహాయపడుతుంది. క్రీడాభిమానులు ఈ స‌రికొత్త క్రీడ‌ను అనుభవించడానికి వీలు కల్పిస్తుందని మేము నమ్ముతున్నాము. మేమిప్పుడు భారతీయ యువతతో వేగంగా అడుగులు వేస్తున్నాం.. క్రీడా పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతున్నాం’’ అని ఆమె స్ప‌ష్టం చేశారు.

Updated Date - 2022-04-14T02:29:32+05:30 IST