Abn logo
Jul 13 2020 @ 03:34AM

అఫ్ఘానిస్థాన్‌ జట్టు వరల్డ్‌కప్‌ నెగ్గాకే నా పెళ్లి!

లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌

కాబుల్‌: టీ20 ఫార్మాట్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ట్విటర్‌లో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి. అఫ్ఘాన్‌ జాతీయ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్‌ను మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని వ్యాఖ్యాత అడగగా ‘అఫ్ఘానిస్థాన్‌ ప్రపంచకప్‌ నెగ్గాకే పెళ్లి చేసుకుంటా’ అని అతడు బదులిచ్చాడు. రషీద్‌ను ట్యాగ్‌ చేసి అతడి వ్యాఖ్యలను పాకిస్థాన్‌ జర్నలిస్టు సాదిఖ్‌ ట్వీట్‌ చేయగా దాన్ని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ‘అఫ్ఘాన్‌ గెలవడానికి.. అదేమి లూడో వరల్డ్‌కప్‌ కాదు’. ‘ఇలాగైతే నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావ్‌’. అంటూ అభిమానులు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

Advertisement
Advertisement
Advertisement