Abn logo
Jan 23 2021 @ 10:02AM

మరోసారి సాయితేజ్‌తో రాశి?

మెగా హీరో సాయితేజ్‌, హీరోయిన్ రాశీఖన్నాది సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన `సుప్రీమ్`, `ప్రతిరోజూ పండగే` సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. త్వరలో వీరిద్దరూ మరోసారి కలిసి సందడి చేయబోతున్నారట. 


సాయితేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు ఈ సినిమాకు దర్శకుడు. సరికొత్త జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయితేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. 

Advertisement
Advertisement
Advertisement