ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2020-11-28T05:07:43+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను ఇతర అవసరాలకు కేటాయించరాదని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు వినూత్న నిరసన తెలియజేశారు.

ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల వినూత్న నిరసన
కళ్లు, చెవులు, నోరు మూసుకొని ఆందోళన చేస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు


నంద్యాల, నవంబరు 27: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను ఇతర అవసరాలకు కేటాయించరాదని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు వినూత్న నిరసన తెలియజేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను కాపాడటంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోరు మెదపడం లేదని.. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి కళ్లు మూసుకుని కూర్చున్నారని.. కలెక్టర్‌ వీరపాండియన్‌ చెవులు మూసుకున్నారని.. కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల సంఘం కార్యదర్శి ఏవీ రమణ అధ్యక్షతన సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఖాదర్‌వలి, పుల్లయ్య, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T05:07:43+05:30 IST