మణిపాల్‌లో అరుదైన చికిత్స

ABN , First Publish Date - 2021-05-09T08:38:59+05:30 IST

క్లిష్టపరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అరుదైన హప్లోఐడెంటికల్‌ మూలకణ మార్పిడి చికిత్సను విజయవంతంగా తాడేపల్లి మణిపాల్‌ ఆ సుపత్రి వైద్యులు నిర్వహించారు

మణిపాల్‌లో అరుదైన చికిత్స

ఏపీలో హప్లోఐడెంటికల్‌ మూలకణ మార్పిడి

చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా గుర్తింపు


తాడేపల్లి టౌన్‌, మే8: క్లిష్టపరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అరుదైన హప్లోఐడెంటికల్‌ మూలకణ మార్పిడి చికిత్సను విజయవంతంగా తాడేపల్లి మణిపాల్‌ ఆ సుపత్రి వైద్యులు నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స గురించి క్యాన్సర్‌, మూలకణ మార్పిడి వైద్యులు డాక్టర్‌ మాధవ్‌ దం తాల వెల్లడించారు. ‘‘కోయ ఈశ్వర్‌సాయి గణేశ్‌ అనే విద్యార్థికి 2016లో టి-లింపోబ్లాస్టిక్‌ లింఫోమాను గుర్తించారు. రెండున్నరేళ్లు అతను చికిత్స తీసుకున్నాడు. 2018లో చికిత్స ముగిసిన ఆరు నెలల్లోనే మరలా బయటపడింది. సదరు రో గిని మణిపాల్‌లో జనవరి 20న చేర్పించారు. వ్యాధినియంత్ర ణ కోసం కీమోథెరపీ చేశాం. వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తరువాత హప్లోఐడెంటికల్‌ (సగం సరిపోలిన) మూలకణ మార్పిడి నిర్వహించాం. సహజంగా ఈ ప్రక్రియలో డాక్టర్లు పూర్తిగా సరిపోలిన హెఎల్‌ఏకు బదులుగా సగం సరిపోలిన హ్యూమన్‌ లికోసైట్‌ యాంటిజన్‌ను తల్లిదండ్రులు లేదంటే తోబుట్టువుల నుంచి సేకరిస్తారు. ఈ చికిత్సలో రోగి తన తండ్రి శ్రీనివాసరావు నుంచి స్టెమ్‌సెల్‌ను పొందారు. ఈతరహా మార్పిడి శస్త్రచికిత్స చేసిన తొలివైద్యశాలగా ఏపీలో మణిపాల్‌ వైద్యశాల నిలిచింది’’ అని తెలిపారు. ‘‘ఈ రోగి మా వైద్యశాలలో చేరి 100 రోజులు అవుతుంది. అప్పటి నుంచి అతను నిరంతరం మా సంరక్షణ, పరిశీలనలో ఉన్నారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్‌ మాధవ్‌ దంతాలతోపాటు వైద్యుల బృందం, కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ జి కృష్ణారెడ్డికి అభినందనలు’’ అని హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి తెలిపారు.

Updated Date - 2021-05-09T08:38:59+05:30 IST