Medicover Hospital లో శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స..

ABN , First Publish Date - 2021-10-19T12:43:55+05:30 IST

ఈ బాలుడి పరిస్థితిని గమనించిన సోమాలియాలోని డాక్టర్లు ...

Medicover Hospital లో శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స..

హైదరాబాద్‌ సిటీ/మాదాపూర్‌ : పుట్టకతో మలద్వారం, మూత్ర మార్గం సరిగ్గా ఏర్పడని పది నెలల శిశువుకు మెడికవర్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను సోమవారం ఆస్పత్రి వైద్యులు వివరించారు. సోమాలియాకు చెందిన 18 నెలల బాలుడికి మలద్వారం లేకపోవడం, మూత్ర మార్గం అసాధారణ స్థితిలో ఉండడం వంటి సమస్యలతో ఇటీవల మెడికవర్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ బాలుడి పరిస్థితిని గమనించిన సోమాలియాలోని డాక్టర్లు అప్పటికే రెండుసార్లు శస్త్రచికిత్స నిర్వహించారు. కానీ బాలుడు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం  కాలేదు. చివరకు బాలుడి ప్రాణాలను కాపాడటం కోసం అక్కడ కొలోస్టమీ నిర్వహించారు.


పరిస్థితి మెరుగుపడకపోవడంతో బాలుడికి మెరుగైన చికిత్సకు  మెడికవర్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పిడియాట్రిక్‌ సర్జన్‌ మధుమోహన్‌రెడ్డి ఈ బాలుడిని పరిశీలించి ఇంటర్మీడియట్‌ అనోరెక్టల్‌ మాల్‌ ఫార్మేషన్‌ స్థితితో  బాధపడుతున్నాడని గుర్తించారు. అంతే కాకుండా పురుషాంగంలో అసాధారణంగా మూత్రనాళం తెరిచి ఉందని గుర్తించారు. ఈ బాలుడికి ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే సాధ్యమని నిర్ధారణకు వైద్యులు వచ్చారు. సాధారణ సర్జరీ కాకుండా రోగి వెన్నెముక భాగం ద్వారా ఈ చికిత్స చేసి మూత్ర, మల మార్గాలను సరిచేశారు. ఈ బాలుడి స్థితిని పరిశీలించగా అల్ట్రాసౌండ్‌ సాంకేతికతతో అతని అవయవ స్థితిని కచ్చితంగా అంచాన వేసి వెన్నెముక భాగం నుంచి శస్త్ర చికిత్స చేశామని, ఆ బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్‌ మధుమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.


పిండ దశలో యూరోరెక్టల్‌ సెప్టమ్‌ అసాధారణ అభివృద్ధి ఫలితంగా ఏర్పడతాయని, చాలా సందర్భాలలో మల మార్గం లేకపోవ డం, లేదంటే జనేంద్రియలు మూత్రనాళ మార్గంలో ఫిస్టులాలా ముగియ డం కనిపిస్తుందన్నారు. అయిదు వేల మందిలో ఒకరికి ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో వైద్యులు రవీందర్‌రెడ్డి, జనార్దనరెడ్డి, నవీత, సెంటర్‌ హెడ్‌ అనిల్‌, ఆపరేషన్‌ హెడ్‌ సంగీత  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T12:43:55+05:30 IST