15 ఏళ్ల బాలికకు అరుదైన సర్జరీ..

ABN , First Publish Date - 2022-05-17T15:51:58+05:30 IST

ఓ బాలికకు (Girl) లంగర్‌హౌజ్‌లోని రెన్నోవా ఆస్పత్రి గైనకాలజిస్టులు అరుదైన సర్జరీ

15 ఏళ్ల బాలికకు అరుదైన సర్జరీ..

హైదరాబాద్‌ సిటీ : ఓ బాలికకు (Girl) లంగర్‌హౌజ్‌లోని రెన్నోవా ఆస్పత్రి గైనకాలజిస్టులు అరుదైన సర్జరీ నిర్వహించారు. మూసుకుపోయిన యోని ముఖ ద్వారానికి సర్జరీ చేసి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఆరు నెలలుగా కడుపునొప్పితో (Stomach pain) బాధపడుతోంది. ఆమెకు రుతుక్రమం కూడా లేకపోవడంతో ఇటీవల బాలికను గైనకాలజిస్టు డాక్టర్‌ పద్మావతికి చూపించారు. వైద్య పరీక్షలో యోని ముఖ ద్వారం మూసుకుపోయినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స (Surgery) చేసి, సరిచేశారు. బాలిక కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ (DisCharge) చేసినట్లు డాక్టర్‌ పద్మావతి చెప్పారు.

Updated Date - 2022-05-17T15:51:58+05:30 IST