కాంటినెంటల్‌ ఆస్పత్రిలో గర్భిణికి అరుదైన చికిత్స

ABN , First Publish Date - 2021-06-20T17:37:13+05:30 IST

ఓ మహిళ 9 నెలల గర్భంతో ఊపిరి ఆడక అవస్థ పడుతుండడంతో

కాంటినెంటల్‌ ఆస్పత్రిలో గర్భిణికి అరుదైన చికిత్స

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : ఓ మహిళ 9 నెలల గర్భంతో ఊపిరి ఆడక అవస్థ పడుతుండడంతో కుటుంబసభ్యులు నానక్‌రాంగూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోవడంతో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. వైద్య బృందం బీపీ, ఇతర పరీక్షలు చేసి వెంటిలేటర్‌పైనే శస్త్రచికిత్స నిర్వహించి తల్లీబిడ్డను కాపాడారు. ఆస్పత్రి సీనియర్‌ కన్సల్‌టెంట్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ జ్యోతి కనకాల మాట్లాడుతూ ఊపిరి ఆడక స్పృహ కోల్పోయిన గర్భిణికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డను కాపాడేందుకు ఆస్పత్రిలో ఉన్న ఆధునిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందన్నారు. ప్రసవం తర్వాత బిడ్డ ఎడవకపోవడంతో ఐసీయూకు తరలించి పిల్లల వైద్యులతో చికిత్స అందించామని, ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

Updated Date - 2021-06-20T17:37:13+05:30 IST