అమెరికాలో అరుదైన ఘనత..మనిషికి పంది గుండె..వైద్య చరిత్రలో మొట్ట మొదటి సారి..

ABN , First Publish Date - 2022-01-11T17:22:40+05:30 IST

అమెరికా డాక్టర్లు మరో అరుదైన ఘనత సాధించారు. పంది గుండెను విజయవంతంగా మనిషికి అమర్చారు.

అమెరికాలో అరుదైన ఘనత..మనిషికి పంది గుండె..వైద్య చరిత్రలో మొట్ట మొదటి సారి..

వాషింగ్టన్: అమెరికా డాక్టర్లు మరో అరుదైన ఘనత సాధించారు. పంది గుండెను విజయవంతంగా మనిషికి అమర్చారు. 57 ఏళ్ల వ్యక్తికి గుండె ఆపరేషన్ చేశారు. జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను అమర్చారు. వైద్య చరిత్రలో ఇది తొలిసారని డాక్టర్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో అవయవదానాల కొరతను అధిగమించొచ్చని యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ స్కూల్ ప్రకటన విడుదల చేసింది.


గతంలో మనిషికి పంది కిడ్నీలను అమర్చి విజయం సాధించిన వైద్యులు.. తాజాగా గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. గుండె ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి పూర్తిగా కొలుకునేవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని డాక్టర్లు తెలిపారు. మానవుడిలో పంది గుండె ఎలా పనిచేస్తుందనే దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు.

Updated Date - 2022-01-11T17:22:40+05:30 IST