రారా.. కన్నయ్య

ABN , First Publish Date - 2022-08-20T04:49:32+05:30 IST

శ్రీకృష్ణ జన్మాష్టమిని మునిసిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్ర వారం ఘనంగా జరుపుకున్నారు.

రారా.. కన్నయ్య
భూత్పూర్‌ న్యూఏరా పాఠశాలలో ఉట్టి కొడుతున్న చిన్నారి

- ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

- అలరించిన చిన్నారుల వేషధారణ

- ఉత్సాహంగా ఉట్ల వేడుక


భూత్పూర్‌, ఆగస్టు 19: శ్రీకృష్ణ జన్మాష్టమిని మునిసిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్ర వారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక న్యూఏరా పాఠశాలలో చిన్నారులు రాధాకృష్ణుడి వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో చిన్నారులు ఉట్లు కొట్టారు. కరస్పాండెంట్‌ క్రాంతికుమార్‌, హెచ్‌ఎం భరద్వాజ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- చిన్నచింతకుంట : మండలంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రా మాల్లోని ప్రధాన ఆలయాల్లో ఉట్లు కొట్టే కార్యక్ర మాన్ని భక్తులు పెద్దఎత్తున నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ గ్రా మాల్లో చిన్నారులు కృష్ణుని వేషధారణలో అలరించారు. 

- మహబూబ్‌నగర్‌ టౌన్‌/మెట్టుగడ్డ : స్థానిక పద్మావతి కాలనీలోని శ్రీమురళీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వేడు కల్లో భాగంగా శనివారం ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. అదేవిధంగా, అప్పన్నపల్లిలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా గ్రామస్థులు భక్తిగీతాలు ఆలపిస్తూ శ్రీకృ ష్ణుడి విగ్రహాన్ని పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగిం చారు. అనంతరం గ్రామ నడిబొడ్డున ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, యువకులు ఉత్సా హంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సామె నాగార్జున, సామె కృష్ణయ్య, కోమటి సత్యం, సామె హనుమంతు, వార్ల నర్సింలు, బండి నాగరాజు, జక్కని యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

- జడ్చర్ల : పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలోని శ్రీకృష్ణమందిరంలో బాలకృష్ణ భక్త సమాజం ఆధ్వర్యంలో మూలవిరాట్టు కు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోమా తకు ప్రత్యేక పూజలు చేశారు. భగవద్గీత పారా యణం, హనుమాన్‌చాలీసా పఠనం, శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను నిర్వ హించారు. అలాగే, పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిరంలో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు. చిన్నారులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. 

- అడ్డాకుల : మండల కేంద్రంలో కురువ, యాదవ యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యాదవ కమ్యూనిటీ భవనంలో రాధాకృష్ణుల చిత్ర పటాలకు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు రూ.20 వేలు నిర్వాహకులకు అందించారు. అనంతరం ఉట్టిని ఊరేగింపుగా బాణాసంచా కాలుస్తూ గ్రామ బొడ్రాయి చుట్టు తిప్పారు. అనంతరం శ్రీశివాంజనేయ షిరిడీసాయి దేవాలయములో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. యువకులు, మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- నవాబ్‌పేట : మండల కేంద్రంతో పాటు, యన్మన్‌గండ్ల, రుద్రారం గ్రామాల్లో శుక్రవారం రాత్రి యువకులు కృష్ణాష్ఠమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగిల్‌ విండో చైర్మన్‌ నర్సింహులు, యాదవ సంఘం నాయకులు, చెన్నారెడి ్డపల్లి సర్పంచ్‌ యాదయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో ఎర్రసత్యం  చౌర స్తాలో జెండా ఎగురవేసి, మాట్లాడారు. శ్రీకృష్ణ భగవా నుడు భగవద్గీత రచించి యావత్‌ ప్రపంచానికి మార్గ నిర్ధేశనం చేశారన్నారు. నవాబ్‌పేట సర్పంచ్‌ గోపాల్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మయ్య, అంజయ్య వి విధ గ్రామాల యాదవ సోదరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-20T04:49:32+05:30 IST