YCP MLA: అంత మాట అనేసిందేంటి జగనన్నా.. పాపం ఈ వైసీపీ ఎమ్మెల్యే ముఖం మీదే..

ABN , First Publish Date - 2022-08-19T19:42:18+05:30 IST

‘మీరు చాలా ప్రభుత్వ పథకాల పేర్లు చెబుతున్నారు. వాటి పేర్లు కూడా నేను ఎప్పుడూ వినలేదు. నాకు పెళ్లై ఆరేళ్లు అవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి..

YCP MLA: అంత మాట అనేసిందేంటి జగనన్నా.. పాపం ఈ వైసీపీ ఎమ్మెల్యే ముఖం మీదే..

మీ పథకాల పేర్లే వినలేదు

గడప గడపలో రాప్తాడు ఎమ్మెల్యేకి స్పష్టం చేసిన మహిళ


చెన్నేకొత్తపల్లి (శ్రీసత్యసాయి జిల్లా): ‘మీరు చాలా ప్రభుత్వ పథకాల పేర్లు చెబుతున్నారు. వాటి పేర్లు కూడా నేను ఎప్పుడూ వినలేదు. నాకు పెళ్లై ఆరేళ్లు అవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ పథకమూ మాకు రాలేదు. మీరు చెబుతున్నవాటిలో ఒక రేషన్‌ మాత్రమే మేం తీసుకుంటున్నాం..’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డికి ఓ మహిళ ముఖం మీదే చెప్పేసింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాల్గొ న్నారు. గ్రామానికి చెందిన కిరణ్‌ కుమార్‌ ఇంటి వద్దకు ఎమ్మెల్యే వెళ్లారు. కిరణ్‌ కుమార్‌ భార్య చిగిచెర్ల సాయికృపతో ఎమ్మెల్యే మాట్లాడారు.



ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి చదివి వినిపించారు. ఈ పథకాల ద్వారా మీ కుటుంబానికి రూ.1,70,380 లబ్ధి చేకూరింది అని ఎమ్మెల్యే వివరించారు. దీంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘మీరే చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. మా అత్త మేము వేర్వేరుగా ఉంటున్నాం. మాకైతే ఏదీ వచ్చింది లేదు పెట్టింది లేదు..’ అని ఎమ్మెల్యే ముఖం మీదే చెప్పేసింది. దీంతో ఎమ్మెల్యే అక్కడున్న వలంటీర్‌ను, సచివాలయ సిబ్బందిని పిలిచి, వీరి కుటుంబ పరిస్థితి ఏమిటని అడిగారు. ఆ తరువాత ‘మీ అత్తకు పథకాలన్నీ అందుతున్నాయమ్మా.. మీరందరూ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి’ అని చెప్పి ముందుకు వెళ్లిపోయారు.

Updated Date - 2022-08-19T19:42:18+05:30 IST