Advertisement
Advertisement
Abn logo
Advertisement

యస్.. అదే నా ఫ్యాషన్ : Paritala Sriramకు ఎమ్మెల్యే తోపుదుర్తి స్ట్రాంగ్ కౌంటర్

అనంతపురం: ‘‘పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచడం నా ఫ్యాషన్’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ మీడియాముందుకొచ్చి తోపుదుర్తి చరిత్ర ఇదిగో అంటూ పలు సంచలన వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కౌంటర్‌గా తోపుదుర్తి మీడియా మీట్ నిర్వహించారు. ఇవాళ క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు వైసీపీ నేతల మాటలను లెక్క చేయడం లేదని... టీడీపీ వాళ్లకు ప్రత్యేక టైం ఇచ్చి రాచమర్యాదలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ప్రకాష్ రెడ్డి చరిత్ర ఏమిటో సీఎం జగన్‌కు బాగా తెలుసు.. నువ్వు (పరిటాల శ్రీరామ్) చెప్పాల్సిన అవసరం లేదు.. వందలమంది ఫోటోలు తీయించుకుంటారని.. కాంట్రాక్టర్ పరమేశ్వర రెడ్డి ఫొటో తీయించుకుంటే తప్ప... కర్ణాటకకు బియ్యం విక్రయించడంలో మీరే సిద్ధహస్థులు... భవిషత్తులో మీ పార్టీకి అభ్యర్థులే కరువు... రాప్తాడులో నాపై పోటీ ఎవరు చేస్తున్నారో చెప్పండి.. నాపై మీ కుటుంబంలో ఎవరు పోటీకి ఉంటారు…?’’ అంటూ పరిటాల శ్రీరామ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.


మేడా చంద్రశేఖర్ కాంప్లెక్స్‌ను ఓ బ్యాంక్ వేలం వేస్తుంటే వైట్ అమౌంట్‌తో కొనుగోలు చేశామని.. దానిని పది కోట్లకు అమ్మి వచ్చిన లాభంతో హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశామని తెలిపారు. హార్మొనీ సిటీ సాఫ్ట్ వేర్ పార్క్ ఏర్పాటుపై ఆ కంపెనీ ప్రతినిధులే స్పందిస్తారన్నారు.  తాము ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుపు డ్రామా మొదలు పెట్టారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు.


Advertisement
Advertisement