వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2022-08-08T06:50:56+05:30 IST

వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. కోర్కె తీర్చకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తాని బెదిరించిన కంఠంనేని పంక్షన్‌హాల్‌ యజమాని కంఠంనేని వేణుగోపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన

- కోర్కె తీర్చకుంటే కుటుంబసభ్యులను చంపుతానని బెదిరింపు 

- స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన మహిళ కుటుంబసభ్యులు  

పెనుగంచిప్రోలు, ఆగస్టు 7: వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. కోర్కె తీర్చకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తాని బెదిరించిన కంఠంనేని పంక్షన్‌హాల్‌ యజమాని కంఠంనేని వేణుగోపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా కంఠంనేని వేణుగోపాల్‌ పెనుగంచిప్రోలుకు చెందిన వివాహితను లైంగికంగా వేధింస్తున్నాడు. తన జోలికి రావద్దంటూ మహిళ ప్రాధేయపడినా ఇబ్బంది పెట్టడంతో మహిళ బంధువులకు విషయం తెలిపింది. ఆదివారం సాయంత్రం మహిళ బంధువులు వేణుగోపాల్‌ను పట్టుకొని నూతలపాటి పంక్షన్‌హాల్‌ సమీపంలో స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అతడి కారును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్‌.హరిప్రసాద్‌ హుటాహుటిన సిబ్బందిని పంపి వేణుగోపాల్‌ను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వేణుగోపాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మహిళ బంధువుల దాడిలో గాయపడిన వేణుగోపాల్‌ను 108లో చికిత్స నిమిత్తం నందిగామకు తరలించారు. 

Updated Date - 2022-08-08T06:50:56+05:30 IST