వేగంగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-22T04:52:47+05:30 IST

కరోనాపై పోరులో అలుపెరగకుండా శ్రమించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి మొదటి విడతలో చేపట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కామారెడ్డి జిల్లాలో వేగం సాగుతోంది.

వేగంగా వ్యాక్సినేషన్‌

కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన వారు 3,033 

నాలుగు రోజుల్లో ఇప్పటివరకు తీసుకున్న 2,952 మంది 

మరో రెండు రోజుల్లో పూర్తికానున్న మొదటి విడత వ్యాక్సినేషన్‌

సందేహాలు, ఆరోగ్య సమస్యలతో పలువురు దూరం

కామారెడ్డి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరులో అలుపెరగకుండా శ్రమించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి మొదటి విడతలో చేపట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కామారెడ్డి జిల్లాలో వేగం సాగుతోంది. ఐదురోజుల్లో ప్రక్రియను పూ ర్తిచేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకోగా.. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. గడిచిన నాలుగు రోజు ల్లో మొత్తం 2,952 మందికి టీకాలు వేశారు. వైద్య ఆరోగ్యశాఖ సి బ్బంది పలువురు అనారోగ్యంతో బాధపడుతుండడం.. స్థానికంగా లేకపోవడంతో పాటు సందేహాలతో కొందరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. నిర్దేశించుకున్న మేరకు మరో రెండు రోజుల్లో అందరికీ కోవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ అందిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రశాంతంగా సా గుతోంది. టీకా తీసుకున్న వారికి ఎలాంటి అనారోగ్యసమస్యలు త లెత్తకపోవడం వారంతా ఆరోగ్యంగా ఉండడంతో వైద్యఆరోగ్యశాఖ అందరికీ టీకాలు ఇచ్చేందుకు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొదటి విడత ‘ఎ’ కేటగిరీలో 3,033 మంది

కరోనా మహమ్మరిపై సుమారు 10 నెలలపాటు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు వ్యాక్సినేషన్‌ అందుబాటులో కి వచ్చింది. నాలుగురోజుల నుంచి వైద్య ఆరోగ్యశాఖ సైతం ప్రజల కు వాక్సిన్‌పై నమ్మకం కల్గిస్తూ టీకాలు వేసేందుకు సిద్ధమైంది. అ యితే మొదటి దఫాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో భాగంగా జిల్లాలో మొ దటి దఫాలోని ‘ఎ’ కేటగిరీ కింద ప్రభుత్వ వైద్యులు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారు. ఇలా వీర ందరి పేర్లను కొవిడ్‌ యాప్‌ లో నమోదుచేశారు. మొత్తం 3,033 మంది వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది 102, 104, 108 సి బ్బందికి మొదటి విడతలో టీ కాలు వేయాలని నిర్ణయించా రు. వీరందరికీ ఇప్పటికే ఆ యా టీకా కేంద్రంలో వ్యాక్సిన్‌ వేస్తున్నారు. 

నాలుగు రోజుల్లో టీకా తీసుకున్న 2,952 మంది

జిల్లాలో మొదటి విడతలో మొత్తం 3,033 మందికి టీకాలు వే యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో గడిచిన నాలుగు రోజు ల్లో ఇప్పటివరకు 2,952 మందికి టీకాలు వేశారు. తొలిరోజు 16న నాలుగు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 400 మందికి టీకాలు వేయాల్సి ఉ ండగా.. 175 మందికి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేశారు. 18న 7 కేంద్రాలలో 700 మందికి టీకాలు వేయాల్సి ఉండగా.. 274 మంది తీసుకున్నా రు. 19న 28 కేంద్రాలలో 480 మందికి టీకా వేయాల్సి ఉండగా.. 1,600 మందికి వ్యాక్సిన్‌ వేశారు. అప్పటి నుంచి జిల్లాలో వ్యాక్సినేష న్‌ ఊపందుకుంది. గురువారం 21 కేంద్రాలలో మొత్తం 630 మం దికి టీకా వేయాల్సి ఉండగా.. 903 మందికి టీకాలు ఇచ్చారు. ఇలా నాలుగు రోజుల వ్యవధిలో 2,952 మంది టీకాలు తీసుకున్నారు. ఈ లెక్కన మొదటి దఫాలోని ఏ కేటగిరీలో మరో 81 మంది టీకా లు తీసుకోవాల్సి ఉంది. అయితే వీరికోసం మరో రెండు రోజుల పా టు టీకాలు వేయనున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఆరోగ్య సమస్యలు, సందేహాలతో దూరం

జిల్లాలో పలువురు వైద్య సిబ్బంది ఆరోగ్య సమస్యలతో బాధప డుతుండడం మరికొందరు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినే షన్‌కు రాలేకపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొందరు సందేహాలు, భయంతో టీకాలు వేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిని గుర్తించి అధి కారులు వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు సందేహాలను నివృత్తి చేస్తూ టీకాపై భరోసా కల్పిస్తున్నారు. ఎవరు వ్యాక్సినేషన్‌పై భయపడాల్సిన అవస రం లేదని అపోహలు పడవద్దని వైద్య ఆరో గ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లా లో ఇప్పటివరకు 2,952 మంది టీకాలు తీ సుకున్నప్పటికీ వీరంతా ఆరోగ్యంగానే ఉ న్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పే ర్కొంటున్నారు. 

ఇప్పటివరకు 2,952 మంది టీకాలు తీసుకున్నారు.

చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

జిల్లాలో మొదటి దపాక్రింద ‘ఎ’ కే టగిరీలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బందితో కలిసి 2,952 మంది టీకాలు తీసుకు న్నారు. మిగిలిన వారికి మరో రెం డు రోజుల్లో టీకాను ఇస్తాం. ఇప్ప టి వరకు టీకా తీసుకున్న వారంద రూ ఆరోగ్యంగానే ఉన్నారు. టీకా పై ఎవరు భయపడాల్సిన అవస రం లేదు. మొదటి విడతలోని ‘బీ’ కేటగిరీలో పోలీసులు, రెవె న్యూ, శానిటేషన్‌ సిబ్బంది వారి వివరాలను సేకరిస్తున్నాం. త్వరలో వారికి వేయనున్నాం.

Updated Date - 2021-01-22T04:52:47+05:30 IST