త్వరితగతిన భూ సర్వే

ABN , First Publish Date - 2022-07-06T05:50:53+05:30 IST

భూ సర్వే పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆదేశించారు.

త్వరితగతిన భూ సర్వే
వైదనలో ప్రభుత్వ స్ధలాల భూసర్వే మ్యాప్‌ను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు

జేసీ శ్రీనివాసులు ఆదేశం

పలు గ్రామాలలో పనుల తనిఖీ

బల్లికురవ, జూలై 5: భూ సర్వే పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆదేశించారు. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నందున, రైతులు పంటలు సా గు చేసేలోపే ఈ పనులు పూర్తయ్యేలా సిబ్బంది పని చేయాలన్నారు. బల్లికురవ మండలంలోని వేమవరం, బల్లికురవ, వైదన, కొప్పెరపాడు, కూ కట్లపల్లి, గొర్రెపాడు, వెలమవారిపాలెం, కొత్తూ రు గ్రామాలలో ప్రభుత్వ ఆదేశాలతో భూసర్వే పనులు గత నెల రోజుల నుంచి శరవేగంగా జరుగుతున్నాయి. మంగ ళవారం జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు వేమవరం, బల్లికురవ, వైదన, కొప్పెరపాడు గ్రామా లలో భూసర్వే పనులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన సర్వేయర్లతో  మాట్లాడుతూ గ్రామాలలో భూ ముల సర్వే వేగంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు సమాచారం అందించి వారి సమక్షంలో రికార్డుల ప్రకారం సర్వే చేపడితే సమస్యలు ఉండవన్నారు. రై తులకు ఇబ్బందులు రాకుం డా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూసర్వే చే యిస్తుందని చెప్పారు. రైతు లు వద్ద ఉన్న పట్టాలు, పా సుపుస్తకాలను పరిశీలించి భూమి ఉన్న ప్రతి రైతుకు అన్‌లైన్‌ చేయాలన్నారు. గ్రా మాలలో అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలను వెంటనే పూర్తి చేయించాలని పంచాయతీరాజ్‌ ఏఈ హనుమంతరావు ను ఆదేశించారు. పాఠశాలల్లో ఆదనపు తరగతి గదులు మంజుర య్యాయని, వాటిని కూడా పూర్తి చేయించాలన్నారు. గృహ నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులను వెంటనే గృహాల పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అశోక్‌వర్ధన్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, సర్వేయర్లు రాజు, చంద్ర, గ్రామ సర్పంచ్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T05:50:53+05:30 IST