పంచాయతీల్లో వేగంగా ఆస్తుల నమోదు

ABN , First Publish Date - 2020-10-18T10:07:36+05:30 IST

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం టీఎస్‌ ఎన్‌పీబీలో వివరాలు పొందుపరిచే..

పంచాయతీల్లో వేగంగా ఆస్తుల నమోదు

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం టీఎస్‌ ఎన్‌పీబీలో వివరాలు పొందుపరిచే ప్రక్రియ గ్రామపంచాయతీల్లో వేగంగా సాగుతోంది. శనివారం సాయంత్రానికి 90 శాతానికి చేరువలో నమోదు పూర్తయినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 539 మండలాల పరిధిలోని 12,765 గ్రామపంచాయతీల్లో 62,83,802 ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రానికి 52,98,308 ఆస్తుల నమోదుతో 84.32 శాతం నమోదు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మూడు రోజుల్లో గ్రామ పంచాయతీల్లో వందశాతంగా పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-10-18T10:07:36+05:30 IST