దేశంలో గేమ్‌ ఛేంజర్‌గా నిలువనుంన్న మైక్రో ఏటీఎం సర్వీసులు: రపీ పే

ABN , First Publish Date - 2020-09-10T15:02:34+05:30 IST

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్‌ కంపెనీ రపీ పే దేశవ్యాప్తంగా మైక్రో ఏటీఎం (ఎంఏటీఎం)లను భారతదేశవ్యాప్తంగా ఆవిష్కరించింది. క్యాపిటల్‌ ఇండియా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (సీఐఎఫ్‌ఎల్‌)కు...

దేశంలో గేమ్‌ ఛేంజర్‌గా నిలువనుంన్న మైక్రో ఏటీఎం సర్వీసులు: రపీ పే

న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్‌ కంపెనీ రపీ పే దేశవ్యాప్తంగా మైక్రో ఏటీఎం (ఎంఏటీఎం)లను భారతదేశవ్యాప్తంగా ఆవిష్కరించింది. క్యాపిటల్‌ ఇండియా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (సీఐఎఫ్‌ఎల్‌)కు ఫిన్‌టెక్‌ అనుబంధ సంస్థ అయిన కంపెనీ వినియోగదారులకు బ్యాంకింగ్‌ వ్యాపార ప్రతినిధులు (బీసీలు) సేవలను అందించడం కోసం ఫ్రాంచైజ్డ్‌ రిటైల్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తూ ఈ మైక్రో ఏటీఎంలను ప్రారంభించింది. ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్‌ కోసం మైక్రో ఏటీఎంలు గేమ్‌ ఛేంజర్‌గా నిలువనున్నట్లు రపీ పే నమ్ముతోంది. ముఖ్యంగా టైర్‌ 2, 3 పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రపీ పే బీసీ నమూనా, ఆత్మనిర్బర్‌ భారత్‌ నిర్మాణంలో బలీయమైన పాత్రను పోషిస్తూ లక్షలాది మంది భారతీయ రిటైలర్లకు స్వీయసమృద్ధి అవకాశాలను సైతం అందించనుంది.


ఆర్‌బీఐ సమాచారం ప్రకారం దేశంలో 2.2 లక్షల ఏటీఎంలలో కేవలం 19% ఏటీఎంలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. భారతదేశ జనాభాలో 62% మంది అక్కడే ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అతి తక్కువగా విస్తరించడంతో పాటుగా ప్రతి సంవత్సరం ఈ ఏటీఎంల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఈ కారణం చేతనే మైక్రో ఏటీఎంల కోసం అత్యధిక డిమాండ్‌ ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది తగిన పరిష్కారం చూపడంతో పాటుగా వారి నగదు విత్‌డ్రాయల్‌ అవసరాలను సైతం తీర్చనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రపీ పే మైక్రో ఏటీఎంలు పూర్తి అందుబాటులో ఉంటాయి. రపీ పే ఏజెంట్‌ యాప్‌తో అతి సులభంగా కనెక్ట్‌ అయి ఉంటుంది. భారతదేశవ్యాప్తంగా రపీపే సాథీస్‌ అంతా ఈ ఏజెంట్‌ యాప్‌ వినియోగిస్తున్నారు. ఆర్‌బీఐ నుంచి పీపీఐ (ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌)ను రపీ పే కలిగి ఉంది. ఇది పూర్తి సురక్షితం మరియు ఏజెంట్లతోపాటుగా వినియోగదారులకు సైతం ఆధారపడతగిన రీతిలో ఉంటుంది.

Updated Date - 2020-09-10T15:02:34+05:30 IST