కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. బీర్భుమ్ జిల్లాలోని బోల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి దానిని తన మొబైల్‌లో చిత్రీకరించాడు.
ఆ తర్వాత ఆ వీడియో చూపించి బాలికను బెదిరించిన నిందితుడు మరికొందరితో కలిసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బోల్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి