Abn logo
Jul 29 2021 @ 12:06PM

police lockup: అత్యాచార కేసు నిందితుడి ఆత్మహత్య

ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

హమీర్‌పూర్ (ఉత్తరప్రదేశ్): అత్యాచారం కేసులో నిందితుడైన ఓ యువకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌదహ కొత్వాలీ పోలీసుస్టేషన్ లాకప్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. మహాబా జిల్లా ఖండువా గ్రామానికి చెందిన సంజయ్ ను మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేసి లాకప్ లో ఉంచారు. సంజయ్ లాకప్ లో లుంగీతో ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ కేసులో ఎస్ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.పోలీసుల నిర్లక్ష్యం వల్లనే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ ఘటనపై అదనపు ఎస్పీతో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.