అత్యాచార నిందితుల్లో సత్ప్రవర్తనా!

ABN , First Publish Date - 2022-08-19T06:46:02+05:30 IST

అత్యాచార నేరస్తులకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ, స్వాతంత్య్ర వేడుకలను అపహాస్యం చేసిందని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కన్వీనర్‌ వి.ఎస్‌.కృష్ణ మండిపడ్డారు.

అత్యాచార నిందితుల్లో సత్ప్రవర్తనా!
నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాసంఘాల ప్రతినిధులు

స్వాతంత్య్ర దినోత్సవం రోజు విడుదలపై ప్రజా సంఘాల ఆగ్రహం

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన  

నేరస్తులకు కొమ్ముకాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం

సిరిపురం, ఆగస్టు 18 :  అత్యాచార నేరస్తులకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ, స్వాతంత్య్ర వేడుకలను అపహాస్యం చేసిందని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కన్వీనర్‌ వి.ఎస్‌.కృష్ణ మండిపడ్డారు. గుజరాత్‌ మారణకాండలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో కేసులో 11 మంది నేరస్తులను ఆగస్టు 15న విడుదల చేయడాన్ని, రాజస్థాన్‌లో మూడో తరగతి చదువుతున్న ఇంచర్‌ మేఘ్‌వాల్‌ అనే దళిత విద్యార్థి మంచినీళ్ల మట్టికుండ ముట్టుకున్నందుకు ఉపాధ్యాయుడు కొట్టి చంపేయడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం మహిళా చేతన, హెచ్‌ఆర్‌ఎఫ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.


ఈ నిరసనలో వివిధ ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలు, దళితులు, పేదలకు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకమని ఈ ఘటన నిరూపిస్తోందన్నారు.   హత్యాచార నేరస్తులను తక్షణం జైలుకు పంపి, దళిత బాలుడి హత్యకు కారణమైన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలనిడి మాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌వో ఎ.సురేష్‌, భారత నాస్తిక సమాజం ప్రతినిధి వై.నూకరాజు, ముస్లిం థింకర్స్‌ ఫోరం జహారా, అహ్మద్‌ హర్షరప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T06:46:02+05:30 IST