రేపటితో ముగియనున్న రాపత్తు ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-01-22T04:16:31+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాపత్తు సేవలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ నెల 13న ప్రారంభమైన రాపత్తు సేవలు 23తో ముగియనున్నాయి.

రేపటితో ముగియనున్న రాపత్తు ఉత్సవాలు

 సోమవారం నుంచి మూడు రోజులు విలాసోత్సవాలు

భద్రాచలం,జనవరి21: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాపత్తు సేవలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ నెల 13న ప్రారంభమైన రాపత్తు సేవలు 23తో ముగియనున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం దసరా మండప నిర్వాహాకులు డాక్టర్‌ ఎస్‌ఎల్‌ కాంతారావు, డాక్టర్‌  బి. సుబ్బరాజు, ఎస్‌ఎన్‌వి రామారావు, బి. రమేష్‌ ఆధ్వర్యంలో స్వామి వారికి రాపత్తు సేవ నిర్వహించారు. భక్తులు దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఇదిలా ఉండగా 24 నుంచి మూడురోజుల పాటు విలాసోత్సవాలు  నిర్వహించనున్నారు. కాగా 29న స్వామి వారికి విశ్వరూప సేవ సర్వదేవతా అలంకారం నిర్వహించ నున్నారు. ఈ సమయంలో స్వామి వారికి ప్రత్యేక ప్రసాదం కదంబాన్ని సమర్పిస్తారు. 

స్వర్ణభద్రకవచాలతో దర్శనమిచ్చినస్వామివారు

భద్రాద్రి రామయ్య శుక్రవారం స్వ్ణర్ణభద్రకవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే స్వామి వారికి నిత్య కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని నిత్య కల్యాణ మండప వేదిక వద్దకు తీసుకురాగా సహస్రనామార్చన నిర్వహించారు.    

Updated Date - 2022-01-22T04:16:31+05:30 IST