పుట్టబోయే బేబీ పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తున్న రణ్ వీర్ సింగ్.. రోటీ మేకర్ ఫొటోతో భర్తను ట్రోలింగ్ చేస్తున్న దీపికా పదుకొణె

బాలీవుడ్ సెలెబ్రిటీలైన షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, శిల్పాశెట్టి, అవితాబ్ బచ్చన్ తదితరులెందరో రియాలిటీ షోలకు హోస్ట్‌లుగా వ్యవహరించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యువ హీరో చేరనున్నారు. రామ్ లీలా, పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపిన హీరో రణ్ వీర్ సింగ్. ‘‘ బిగ్ పిక్చర్’’ అనే రియాలిటీ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. కలర్స్ ఛానల్‌లో ఆ షో ప్రసారం కానుంది. ‘‘ బిగ్ పిక్చర్ ’’ రియాలిటీ షో‌లో  తనకు పుట్టబోయే బేబీ పేరును షార్ట్ లిస్ట్ చేస్తున్నారు.

కలర్స్ టీవీలో ‘‘ బిగ్ పిక్చర్ ’’ ప్రోమో తాజాగా విడుదలైంది. తన పెళ్లి గురించి, భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల గురించి చర్చిస్తూ ఆ ప్రోమోలో కనిపించారు.  ఆ వీడియోలో ఒక కంటెస్టెంట్‌తో రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ నాకు పెళ్లి అయిందని మీ అందరికీ తెలుసు. రెండు, మూడు సంవత్సరాల్లో పిల్లలు కూడా పుడతారు. మీ వదిన  చాలా మంచిది. మాకు పుట్టబోయే బేబీ ఫొటోలను ప్రతిరోజు నేను చూస్తున్నాను. ఒక బేబీని ఇవ్వమని మీ వదినకు చెప్పు. అప్పుడు నా జీవితం అద్భుతంగా ఉంటుంది ’’ అని చెప్పారు


తన భర్తను ట్రోల్ చేస్తూ దీపికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. రోటీ మేకర్ ఫొటోను పోస్ట్ చేస్తూ వంటగదిలో ఈ ఉపకరణాన్ని ఏవిధంగా వాడుతారని అడిగింది. మల్టిపుల్ ఛాయిస్‌లు కూడా ఇచ్చింది. చపాతీలు చేయడానికి, గుడ్డును ఉడకబెట్టడానికి, భర్త ఇంటికి ఆలస్యంగా వస్తే కొట్టడానికి, గల్లీ క్రికెట్‌లో బ్యాట్‌గా అంటూ రణ్ వీర్ సింగ్‌కు ట్యాగ్ చేసింది. అందుకు అతడు స్పందిస్తూ.. తను లైఫ్ లైన్‌ను ఉపయోగించుకుంటానని సరదాగా చెప్పారు. 


ప్రస్తుతం రణ్ వీర్ నటించిన సూర్యవంశీ, 83 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నయి. అతడు నటించిన సూర్యవంశీ నవంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ‘83’ మూవీ  క్రిస్‌మస్ కానుకగా థియేటర్లల్లో సందడి చేయనుంది. ఈ సినిమాలో అతడికి భార్యగా దీపికా నటించడం విశేషం.


Advertisement