Jul 7 2021 @ 01:01AM

రణ్‌వీర్‌ రాఖీ... అలియా రాణి

రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ జంటగా స్వీయ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సున్నితమైన హాస్య ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ప్రేమ్‌ కహానీ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. వాటికి చెక్‌ పెడుతూ మంగళవారం రణ్‌వీర్‌సింగ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ అనే టైటిల్‌ను కరణ్‌ జోహర్‌ ఖరారు చేశారు. ఈ విషయాన్ని రణ్‌వీర్‌, అలియా, కరణ్‌జోహర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ‘గల్లీబాయ్‌’ తర్వాత వారిద్దరూ మళ్లీ కలసి నటిస్తున్న చిత్రం ఇది. ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ వచ్చిన ఐదేళ్ల తర్వాత కరణ్‌ జోహర్‌ మళ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అలియాభట్‌కు తాతా, బామ్మ పాత్రల్లో సీనియర్‌ నటులు ధర్మేంద్ర, షబానా అజ్మీ కనిపించనున్నారు. జయాబచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

Bollywoodమరిన్ని...