నీట్‌లో 125వ ర్యాంక్‌

ABN , First Publish Date - 2022-05-28T06:08:53+05:30 IST

నీట్‌ పరీక్షలో చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అరూరి హారిక 125వ ర్యాంకు సాధించింది. నీట్‌-2022 జాతీయస్థాయిలో ఎండీఎస్‌ కోర్స్‌ కోసం నిర్వహించిన పరీక్షలో హారిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 125వ ర్యాంకును సాధించింది.

నీట్‌లో 125వ ర్యాంక్‌
అరూరి హారిక

ప్రతిభ కనబర్చిన వెలిమినేడు యువతి


చిట్యాలరూరల్‌, మే 27: నీట్‌ పరీక్షలో చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అరూరి హారిక 125వ ర్యాంకు సాధించింది. నీట్‌-2022 జాతీయస్థాయిలో ఎండీఎస్‌ కోర్స్‌ కోసం నిర్వహించిన పరీక్షలో హారిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 125వ ర్యాంకును సాధించింది. ఏపీలోని తిరుపతి సమీపంలోని ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సీకేఎస్‌ డెంటల్‌ కళాశాలలో బీడీఎ్‌సను పూర్తిచేసింది. గత ఏడాది డిసెంబరులో జరగాల్సిన నీట్‌ పరీక్ష వాయిదా పడటంతో ఈ ఏడాది మే 2న జరిగింది. ఎండీఎ్‌సకై హారిక నీట్‌ పరీక్ష రాయడంతో 27న విడుదలైన పరీక్ష ఫలితాల్లో జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. పేద కుటుంబానికి చెందిన తన  తల్లిదండ్రులు అరూరి కృష్ణయ్య, శంకరమ్మ కూలీలుగా పనిచేస్తూ కష్టపడి చదివించారని హారిక తెలిపారు. రెండేళ్ల క్రితం హారిక సోదరి ఝాన్సీలక్ష్మీ ఎస్‌ఐగా ఉద్యోగం సాధించారు.  

Updated Date - 2022-05-28T06:08:53+05:30 IST