పీయూలో రంగోళి

ABN , First Publish Date - 2022-08-20T04:50:33+05:30 IST

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ సప్తా హంలో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో శుక్రవారం రంగోళి వేడుకలు నిర్వహించారు.

పీయూలో రంగోళి
పాలమూరు యూనివర్సిటీలో జరిగిన రంగోళి పోటీల్లో పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దుతున్న విద్యార్థినులు

- ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్ధులు


పాలమూరు యూనివర్సిటీ, ఆగస్టు 19: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ సప్తా హంలో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో శుక్రవారం రంగోళి వేడుకలు నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గిరిజామంగతాయారు ప్రారంభించారు. యూనివర్సిటీ విద్యార్థినులు పెద్దసంఖ్యలో పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. పోటీలను పీయూ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.కిశోర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.కృష్ణయ్య పరిశీలించారు. అదేవిధంగా, మహబూబ్‌నగర్‌ మండలంలోని కోటకదిరలో రం గోలి వేడుకలు వైభవంగా సాగాయి. సర్పంచ్‌ రమ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ లు నిర్వహించారు. విజేతలకు రైతు సంఘం మండల అధ్యక్షుడు మల్లు దేవేం దర్‌రెడ్డి, సర్పంచ్‌ రమ్య బహుమతులు అందించారు. 

Updated Date - 2022-08-20T04:50:33+05:30 IST