రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ సన్ సిటీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. విదేశీయులే లక్ష్యంగా 40 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వీసా గడువు ముగిసిన 25 మంది నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.