TS news: రంగారెడ్డిలో దొంగ హల్‌చల్

ABN , First Publish Date - 2022-07-23T16:48:10+05:30 IST

జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడలో ఓ దొంగ హల్ చల్ చేశాడు.

TS news: రంగారెడ్డిలో దొంగ హల్‌చల్

రంగారెడ్డి: జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడలో ఓ దొంగ హల్ చల్ చేశాడు. లాలమ్మ గార్డెన్‌లోని ఓ ఇంట్లో ఇమ్రాన్ అనే వ్యక్తి బీరువా పగలగొట్టి దొంగతనానికి యత్నించాడు. పిల్లలు కేకలు వేయడంతో వాళ్లు అరవకుండా ఇమ్రాన్ నోరు మూశాడు. గమనించిన స్థానికులు...దొంగను పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి వచ్చాడా లేక పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-23T16:48:10+05:30 IST