ప్రేమించిన అమ్మాయి కోసం..వరుడి కిడ్నాప్..

ABN , First Publish Date - 2021-04-17T16:58:32+05:30 IST

మైలార్ దేవుపల్లిలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కింగ్స్ కాలనీలోని నదీమ్ ఖాన్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. అయితే.. నదీమ్ ఖాన్‎కు...

ప్రేమించిన అమ్మాయి కోసం..వరుడి కిడ్నాప్..

రంగారెడ్డి: మైలార్ దేవుపల్లిలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కింగ్స్ కాలనీలోని నదీమ్ ఖాన్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. అయితే.. నదీమ్ ఖాన్‎కు ఇటీవల ఓ అమ్మాయితో నిశ్చితార్థం అయింది. అదే అమ్మాయిని ప్రేమించిన వేరే యువకుడు నదీమ్ ఖాన్ వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియుడు అసహనానికి గురై.. బైక్ వెళ్తున్న నదీమ్ ఖాన్‎ను కిడ్నాప్ చేశాడు. నదీమ్ ఖాన్ ఇంటి నుంచి బయటికి వెళ్లి చీకటి పడ్డా ఇంకా తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-17T16:58:32+05:30 IST