Advertisement
Advertisement
Abn logo
Advertisement

రంగారెడ్డి జిల్లా: లంచాలకు ఎగబడుతున్న రెవెన్యూ అధికారులు

రంగారెడ్డి జిల్లా: రిజిస్ట్రేషన్లలో అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తే కొందరు అధికారులు వాటిలోనూ చేతివాటం చూపిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్‌లో కొందరు రెవెన్యూ అధికారులు లంచాలకు ఎగబడుతున్నారు. రంగారెడ్డి జిల్లా, కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు.


కేశంపేట తహసీల్దార్, కార్యాలయం సిబ్బందిపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌కు రైతుల నుంచి వసూళ్లకు తెగబడుతున్నారు. గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన లావణ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయినా అక్కడి సిబ్బందిలో మార్పు రాలేదు. మరింత జాగ్రత్తగా వసూలు చేస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా లంచాలు వసూలు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డు రూమ్‌లోనే వ్యవహారం నడిపిస్తున్నారు.

Advertisement
Advertisement