Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 24 Jan 2022 11:34:52 IST

title teaer : ‘రంగ రంగ వైభవవంగా’ బటర్ ఫ్లై కిస్

twitter-iconwatsapp-iconfb-icon

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ జంటగా బీ.వీ.యస్.యన్ ప్రసాద్ నిర్మిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీకి ‘రంగరంగ వైభవంగా’.. అనే క్లాసీ టైటిల్‌ను ప్రకటిస్తూ నిర్మాతలు ఓ టీజర్ విడుదల చేశారు.  ‘అర్జున్‌రెడ్డి’ తమిళ వెర్షన్ ను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్న గిరీశయ్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పార్క్‌లో బెంచ్ మీద హీరో వైష్ణవ్, హీరోయిన్ కేతికా శర్మ రివీలయ్యారు. కేతిక..  వైష్ణవ్ ను నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా? అని అడిగి కిస్ పెడుతుంది. దానికి వైష్ణవ్ నెక్స్ట్ లెవ్ లో ఉంది అని సమాధానం ఇవ్వడం.. టీజర్‌గా కట్ చేశారు. కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


‘ఉప్పెన’తో టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మూడో చిత్రంగా విడుదవుతోంది ‘రంగరంగ వైభవంగా’. రొమాంటిక్, లక్ష్య చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మకి కూడా ఇది మూడో చిత్రం అవడం విశేషం. మరి వీరి ప్రేమకథ.. పేరుకు తగ్గట్టుగానే ‘రంగరంగ వైభవంగా’ ఉంటుందేమో చూడాలి.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International