Rangapur సర్పంచ్ కరుణాకర్ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-16T16:25:14+05:30 IST

జిల్లాలోని హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ బింగి కరుణాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Rangapur సర్పంచ్ కరుణాకర్ ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ బింగి కరుణాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పద్మశాలి కులానికి చెందిన భూమి విషయంలో మనస్తాపం చెందిన కరుణాకర్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కులానికి చెందిన స్థలంలో మరో వ్యక్తి నిర్మాణం చేపట్టాడు. ఈ వ్యవహారంపై సర్పంచ్‌ను కులస్థులు నిలదీయడంతో కరుణాకర్ తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి యత్నించాడు. సర్పంచ్ పరిస్థితి విషమంగా ఉండటంతో జమ్మికుంట ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-06-16T16:25:14+05:30 IST