కొవిడ్‌తో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-05-16T06:38:32+05:30 IST

బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఒకే రోజు గంటల వ్యవధిలో ముగ్గురు మత్యు వాత పడ్డారు.

కొవిడ్‌తో ముగ్గురి మృతి

 రంగన్నగూడెంలో పరిస్థితి ఆందోళనకరం

హనుమాన్‌జంక్షన్‌, మే 15 :  బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఒకే రోజు గంటల వ్యవధిలో ముగ్గురు మత్యు వాత పడ్డారు. శుక్రవారం ఉదయం వృద్ధురాలు (80), రాత్రి నూజివీడు ఆసుపత్రిలో చికిత్స పొదుతూ మరో వృద్ధుడు (80), శనివారం ఉదయం మరో వ్యక్తి (50) కొవిడ్‌తో మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో ఆందోళన నెలకొంది. శనివారం మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. బాపులపాడులో 2, మల్లవల్లిలో 2, ఆరుగొలనులో 3 కేసులు నమోదు అయ్యాయి. 

 రిపోర్టుల తిరకాసు

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌  వచ్చినా ప్రజలు మంచాన పడుతుండడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆర్టీపీసీఆర్‌ రిపోర్టుల్లో నెగెటివ్‌ రావడంతో  బాధితులు వైద్యం పొందడంలో అలక్ష్యానికి గురై ఇబ్బందుల పాలవు తున్నారు. అనుమానం ఉన్నవారంతా  స్వచ్ఛంద సంస్థలు, దాతలు  పంపిణీ  చేసిన  మెడికల్‌ కిట్లు వాడుతూ ఉపశ మనం పొందుతున్నారు.  మండలం లోని గ్రామాల్లో ఏఎన్‌ఎంలు ఇంటింటా సర్వే చేపట్టారు. జ్వరం, దగ్గు ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించి తగిన  వైద్య సలహాలు అందిస్తు న్నట్లు బాపులపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి మంజూష తెలిపారు. శనివారం  పీహెచ్‌సీలో మంజూషా పర్య వేక్షణలో  వైద్య సిబ్బంది 45 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Updated Date - 2021-05-16T06:38:32+05:30 IST