Abn logo
Apr 23 2021 @ 00:44AM

నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలు రద్దు


రాచర్ల, ఏప్రిల్‌ 22 : మండలంలోని జె.పుల్లలచెరువు గ్రామ సమీపాన నల్లమ ల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవా లు వరుసగా రెండవ సారి కూడా రద్దు అయ్యాయి. సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజులపాటు జరు గుతాయి.  కరోనా నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలను ర ద్దు చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి గురు వారం విలేకరులకు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు అవుతారని, వారి ఆరోగ్యం దృష్ట్యా బ్రహ్మోత్సవాలను రద్దు చేసినట్లు తెలిపారు.  


Advertisement