‘‘ఇంజనీర్ అవ్వమన్నారు... TATA కంపెనీలో ఉద్యోగం... కానీ...’’

గతంలో చాలా మంది డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చెప్పేవారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ కాస్త మారింది. ఇంజనీర్ అవ్వకుండా యాక్టర్లు అవుతున్న వారు చాలా మందే కనిపిస్తున్నారు. బాలీవుడ్ హీరోలు విక్కీ కౌశల్, కార్తిక్ ఆర్యన్ ఇంజనీరింగ్ వదిలేసి వచ్చి క్రేజీ హీరోలు అయిపోయారు. చెప్పుకుంటే ఈ ‘బీటెక్ బాబుల’ లిస్టు పెద్దదే అవుతుంది!


గ్లామర్ ప్రపంచం బాట పట్టిన టాలెంటెడ్ ఇంజనీర్స్‌లో తమిళ నటుడు ఆర్ మాధవన్ కూడా ఒకరు. తాజాగా ఆయన తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నాడు. మాధవన్ తల్లిదండ్రులు అతడ్ని ఇంజనీర్ అవ్వమన్నారట. తరువాత జమ్‌షెడ్‌పూర్‌లోని టాటా కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడమన్నారట. ‘‘త్రీ ఇడియట్స్ సినిమాలోని సీన్ అచ్చం నా జీవితంలోనిదే!’’ అని చెప్పాడు మాధవన్. అయితే, ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో మాదిరిగానే నిజ జీవితంలోనూ మాధవన్ రొటీన్ డిగ్రీలు, రొటీన్ ఉద్యోగాలు వద్దనుకున్నాడు. ‘‘అప్పట్లో భవిష్యత్తులో నేను ఏమవుతానో నాకు తెలియదు. కానీ, 30 ఏళ్లు ఒకే పని మళ్లీ, మళ్లీ చేస్తూ రొటీన్‌గా బతికేయ కూడదని మాత్రం తెలుసు’’ అంటూ తన ఇంజనీరింగ్ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్... 

Advertisement