కాబోయే సీఎం భగవంత్ మాన్ ట్వీట్
చండీఘడ్ (పంజాబ్): తన ప్రమాణస్వీకారోత్సవానికి పసుపురంగు తలపాగాలు ధరించి రావాలని పంజాబ్ రాష్ట్రానికి కాబోయే సీఎం భగవంత్ మాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ గ్రామంలో మార్చి 16న పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రంగ్ దే బసంతి థీమ్‌తో ఖట్కర్ కలాన్ గ్రామం కళకళలాడనుంది. ‘‘ప్రజలు మార్చి 16న నా ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఖట్కర్ కలాన్‌కు చేరుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఆ రోజు మా సోదరులు పసుపురంగు తలపాగాలు ధరించాలని నా మనవి. సోదరీమణులు పసుపు శాలువాలు/స్టోల్‌లు ధరించాలని నేను అభ్యర్థిస్తున్నాను. మేం ఖతర్ కలాన్‌కు బసంత్ రంగులు వేస్తాం’’ అని భగవంత్ మాన్ ట్వీట్‌లో కోరారు.
ఇవి కూడా చదవండి