Randeep Singh Surjewala: కులాలు, మతాల మధ్య కమలం చిచ్చు

ABN , First Publish Date - 2022-09-28T15:32:57+05:30 IST

దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌

Randeep Singh Surjewala: కులాలు, మతాల మధ్య కమలం చిచ్చు

- రాష్ట్రంలో కమీషన్లకు తెగబడిన బీజేపీ సర్కారు 

- కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా

- రాహుల్‌ యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్‌ నేతలు


బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా(Randeep Singh Surjewala) ధ్వజమెత్తారు. అన్నిమతాలు, కులాల ప్రజలంతా కలసి ఉండాలని భారత్‌జోడో యాత్రను కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టినట్లు పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సూర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ఎమ్మెల్యే నా గేంద్ర, ఎంపీ నాసీర్‌ హుసేన్‌, ఇతర కాంగ్రెస్‌ నాయకులు భారత్‌జోడో యాత్ర సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సూర్జేవాలా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్లుగా ప్రజల కోసం కూడ బెట్టిన ఆస్తులను బీజేపీ అమ్ముకుని దేశాన్ని దివాలా తీయించిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేసీ సర్కారు ప్రతి పనికీ కమీషన్లు పెట్టిందని విమర్శించారు. పేసీఎం పేరుతో విడుదలైన పోస్టర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాం శమయ్యాయన్నారు. బడిపిల్లల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వంట ఏజెన్సీల్లో కూడా బీజేపీ సర్కారు కమీషన్లు తీసుకుంటుంటే మిగిలిన పనులకు ప్రత్యేకంగా చెప్పాలా..? అన్నారు. కేపీసీపీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మాట్లాడుతూ భారత్‌ జోడో యాత్రకు రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల నుంచి సుమారు 5 లక్షల మంది పైగానే జనం చేరతారని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర బళ్లారిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలకు సౌకరర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్‌బాబు, కంప్లి ఎమ్మెల్యే గణేష్‌, సండూరు ఎమ్మెల్యే తుకారాం, నాయకులు నారాభరత్‌రెడ్డి, మహమ్మద్‌ రఫీక్‌, జేఎస్‌ ఆంజనేయులు, శ్రీధర్‌బాబు, సంతోష్‌ లాడ్‌, అనిల్‌ లాడ్‌, ముండ్రిగి నాగరాజు, మేయర్‌ రాజేశ్వరి సుబ్బరాయుడు, ముల్లంగి నందీష్‌ బాబు, విక్లీ, రామాంజనేయులు, గుర్రం రమణ, అయాజ్‌, జగన్‌, బసవరాజ్‌, వెంకటేశ్‌ హేగ్డే పాల్గొన్నారు. అంతకు ముందు భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకు


Updated Date - 2022-09-28T15:32:57+05:30 IST