Oct 18 2021 @ 20:24PM

ముంబై సముద్ర తీరంలో రణబీర్ పార్టీ! 500 మందితో రచ్చ!

కరోనా వచ్చిన తరువాత సినిమా వాళ్ల కష్టాలు అన్నీఇన్నీ కావు. నెలల తరబడి షూటింగ్లు బంద్, స్టూడియోలు, థియేటర్లు బంద్, అన్నీ, అంతా బంద్! అయితే, వ్యాక్సిన్ వచ్చాక కూడా పెద్దగా మార్పేం రాలేదు. మరీ ముఖ్యంగా, బాలీవుడ్‌కు కేంద్రంగా ఉన్న ముంబైలో కరోనా ప్యాండమిక్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా కొనసాగింది. దాంతో మళ్లీ షూటింగ్‌లు మొదలు కావటానికే నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే బీ-టౌన్ కళకళలాడుతోంది...


కరోనా అనంతర పరిస్థితుల్లో బాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు జరుగుతున్నప్పటికీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. దాని వల్ల ప్రధానంగా సాధ్యమైనంత తక్కువ మంది సెట్ మీద ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. కానీ, రణబీర్ కపూర్ తాజా చిత్రం తాలూకూ క్యాస్ట్ అండ్ క్రూ పెద్ద రిస్కే తీసుకుంది. ఓ పార్టీ సాంగ్ షూట్ కోసం ముంబైలోని మద్ ఐల్యాండ్‌లో 500 మందితో చీత్రీకరణ జరిపారు. హీరో రణబీర్ కూడా ఈ షూట్‌లో పాల్గొన్నాడు. కరోనా కలకలం తరువాత ఓ సినిమా షూట్‌లో ఇంత మంది పాల్గొనటం ఇదే మొదటిసారి! 


రణబీర్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు లవ్ రంజన్ రూపొందిస్తోన్న సినిమా భారీ షూటింగ్‌తో బాలీవుడ్‌లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మళ్లీ మంచి రోజులు వచ్చాయని ముంబైలో మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి, రణబీర్ బాటలో ఇంకెంత మంది హీరోలు, దర్శకనిర్మాతలు సాగుతారో! 

Bollywoodమరిన్ని...