Abn logo
Sep 21 2020 @ 13:24PM

'నిశ్శబ్దం' ట్రైలర్‌ విడుదల చేసిన రానా

Kaakateeya

అగ్ర కథానాయిక అనుష్క నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్స్‌ ఓపెన్‌ కాకపోవడంతో సినిమాను అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. సోమవారం రోజున 'నిశ్శబ్దం' ట్రైలర్‌ను రానా దగ్గుబాటి తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసి యూనిట్‌ను అభినందించారు. చిత్రంలో అనుష్క సాక్షి అనే దివ్యాంగురాలి(చెవులు వినపడని, మాటలు రాని) పాత్రలో నటించారు. అనుష్క బెస్ట్‌ ఫ్రెండ్ సోనాలి పాత్రలో షాలినిపాండే నటించారు. ఇక అనుష్కను ప్రేమించే వ్యక్తిగా మాధవన్‌ నటిస్తున్నారు. మాధవన్‌, అనుష్క ఓ దెయ్యముండే ఇంట్లోకి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? సోనాలి ఎందుకు కనపడకుండా పోయింది? అనే విషయాలను ఆసక్తికరంగా ఉండేలా ట్రైలర్‌ను కట్‌ చేశారు. సినిమాలో హాలీవుడ్‌ నటుడు అండ్రూ హడ్సన్‌, హీరోయిన్‌ అంజలి పోలీస్‌ ఆఫీసర్స్‌గా నటించారు. సినిమా అంతటినీ అమెరికాలోని సీటెల్‌లో చిత్రీకరించారు. సినిమాపై ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ ఉంది. 'నిశ్శబ్దం' పేరుతో తెలుగులో 'సైలెన్స్‌' పేరుతో తమిళ, మలయాళ భాషల్లో సినిమా అమెజాన్‌లో డైరెక్ట్‌ రిలీజ్‌ అవుతుంది.



Advertisement
Advertisement
Advertisement