Abn logo
May 30 2020 @ 18:50PM

రానా పెళ్లి డేట్‌..!

విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రెండు కుటుంబాల వారు క‌లిసి రోకా వేడుక‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  అప్పుడు ఈ ఏడాదిలోపే రానా, మిహీక పెళ్లి ఉంటుంద‌ని రానా తండ్రి, నిర్మాత డి.సురేశ్‌బాబు తెలియ‌జేశారు. తాజాగా సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న స‌మాచారం మేర‌కు ఆగ‌స్ట్ 8న హైద‌రాబాద్‌లో రానా, మిహీక పెళ్లి జ‌రుగుతుంద‌ని టాక్‌. ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement