Abn logo
Jan 15 2021 @ 12:52PM

స‌రిహ‌ద్దు ద‌ళాల‌తో రానా సాహసాలు..

రొటీన్‌కు భిన్నంగా చేయాల‌ని ఆలోచించే న‌టుల్లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. ఆయ‌న‌కు పాత్ర, దానికున్న ప్రాధాన్య‌త న‌చ్చితే చాలు. చిన్న పాత్ర‌లో అయిన క‌నిపించ‌డానికి రెడీ అంటారు. ఈ స్వ‌భావ‌మే ఆయ‌న్ని ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్‌గా నిల‌బెట్టింది. కేవ‌లం సినిమాలే కాదు.. బుల్లితెర‌పై కూడా రానా ద‌గ్గుబాటి స్పెష‌ల్ షోస్ చేస్తుంటారు. వీటితో పాటు రానా ఓ గొప్ప ప‌నిచేశాన‌ని, దాని వ‌ల్ల గొప్ప అనుభ‌వాన్ని పొందాన‌ని అన్నారు రానా ద‌గ్గుబాటి. ఇంత‌కీ రానా అంత‌లా ఏ ప‌ని చేశారు? అనే విష‌యాన్ని చూస్తే ..రానా స‌రిహ‌ద్దు ద‌ళాల ప‌నితీరుపై డిస్క‌వ‌రీ ప్ల‌స్ ఛానెల్‌తో క‌లిసి `మిష‌న్ ఫ్రంట్ లైన్` అనే డాక్యుమెంట‌రీ చేశాడ‌ట‌. ఈ డాక్యుమెంట‌రీ డిస్క‌వ‌రీ ప్ల‌స్‌లో జ‌న‌వ‌రి 21న ప్ర‌సారం అవుతుంద‌ని తెలిపారు రానా. ఆ రోజున స‌రిహ‌ద్దు ద‌ళాల‌తో రానా ఎలాంటి సాహ‌సాలు చేశాడో చూసేద్దాం మ‌రి. 


Advertisement
Advertisement
Advertisement