హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. పలు భాషల్లో ఆయన బిజీ నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తెలుగులో 'అరణ్య' పేరుతో విడుదలవుతున్న బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ'తో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
25 సంవత్సరాలుగా ఒక అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక మనిషి కథ 'అరణ్య'. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించబోతుందనేలా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఏనుగుల నేపథ్యంలో వినూత్నంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చెప్పడమే కాకుండా.. సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేస్తుంది. ఈ మూవీలో రానాతో పాటు విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ వంటివారు కీలక పాత్రల్లో నటించారు. శంతను మొయిత్రా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.