ఉపవాస సంకల్పం

ABN , First Publish Date - 2022-04-15T05:30:00+05:30 IST

రంజాన్‌ మాసంలో ముస్లింలు పాటించవలసిన ముఖ్యమైన విధి ఉపవాసాలు (రోజాలు). ‘‘ఉపవాసం పాటించే రోజుల్లో...

ఉపవాస సంకల్పం

రంజాన్‌ మాసంలో ముస్లింలు పాటించవలసిన ముఖ్యమైన విధి ఉపవాసాలు (రోజాలు). ‘‘ఉపవాసం పాటించే రోజుల్లో... కడరేయి నలుపు (చీకటి) తగ్గి, తొలి జాము తెలుపు (ఉషోదయ కాంతి) కనబడే వరకూ హాయిగా తినండి. ఆ తరువాత వాటన్నిటినీ త్యజించి, సూర్యాస్తమయమై, చీకటి పడే వరకూ ఉపవాసం ఉండండి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ నిర్దేశించారు.


సహ్‌రీ అంటే ఉపవాసం పాటించే ఉద్దేశంతో తెల్లవారుజామున భోజనం చేయడం. ‘‘సహ్‌రీ చేయండి, అందులో శుభం ఉంది’’ అని మహాప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. ‘‘సహ్‌రీని ఎన్నటికీ వదిలిపెట్టకండి. గుక్కెడు నీళ్ళతోనైనా సహ్‌రీ చేయండి. అలా చేసినవారిపై దైవకారుణ్యం వర్షిస్తుంది. వారి పాపాలు మన్నించాలని దైవ దూతలు ప్రార్థన చేస్తారు’’ అని అత్తర్గీబ్‌ గ్రంథం పేర్కొంటోంది. 

ఉపవాస వ్రతానికి సంకల్పం ఎంతో అవసరం. ‘‘ఈ రోజు నేను రంజాన్‌ ఉపవాసం పాటిస్తున్నాను’’ అని సంకల్పించుకొని... వేకువ జామునే ఉపవాసం ప్రారంభించాలి. ఉపవాసాన్ని ముగిస్తున్నప్పుడు ‘‘దేవా! నీ కోసం ఉపవాసాన్ని పాటించాను. నిన్నే నమ్ముకున్నాను. నువ్వు ప్రసాదించిన ఆహారంతోనే వ్రతాన్ని విరమిస్తున్నాను’’ అని చెప్పుకోవాలి. సూర్యాస్తమయం అయిన వెంటనే ఉపవాసం ముగించాలి. 


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-04-15T05:30:00+05:30 IST