Advertisement
Advertisement
Abn logo
Advertisement

రమ్యశ్రీ హంతకుడిని శిక్షించాలంటూ నిరసన

బాపట్ల: రమ్యశ్రీ హంతకుడికి వెంటనే శిక్షపడేలా చూడాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు పృధ్వీలత డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మంగళవారం స్థానిక వేగేశన ఫౌండేషన్‌ కార్యాలయం వద్ద తెలుగు యువత, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడు రోజులలో దర్యాప్తు, 14 రోజులలో కోర్టు విచారణ, 21రోజులలో ఏకంగా ఉరిశిక్ష విధించేలా దిశ చట్టం రూపొందించామంటూ రాష్ట్రప్రభుత్వం ప్రచారం చేయటమే తప్ప ఆ చట్టం కార్యరూపం దాల్చలేదన్నారు. ఇప్పటికి దిశ చట్టం అంటూ మహిళలను మాయ చేయాలని చూస్తున్నారన్నారు. దిశ చట్టం తెచ్చామని సొంత మీడియాలో రూ.30 కోట్లతో పబ్లిసిటీ చేసుకున్న తర్వాత వందలమంది మహిళలు బలిఅయ్యారన్నారు. ఇకనైనా మహిళలను హత్యచేసిన వారికి ఉరిశిక్ష వేయాలన్నారు. 


కార్యక్రమంలో మహిళ ప్రధాన కార్యదర్శి పల్లం సరోజనీ, తెలుగు యువత అధ్యక్షుడు సాంబశివరావు, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు మువ్వా శరత్‌బాబు, కార్యదర్శి కుర్రా ధనేంద్ర, గోవర్ధనగిరి, నవీన్‌, సోమరౌతు అనంత పద్మనాభయ్య, జోగి గ్లోరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement